తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో ధగధగలాడే దర్శన వరుసలు

ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో మరెక్కడా లేని విధంగా దైవదర్శన వరుసల సముదాయ ఏర్పాటుకు యాడా సన్నద్ధమవుతోంది.

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

By

Published : Nov 24, 2019, 9:30 AM IST

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

యాదాద్రి ప్రధాన ఆలయ విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దైవదర్శన వరుసల సముదాయ ఏర్పాటుకు యాడా సన్నద్ధమవుతోంది. ఆలయ శిల్పి ఆనందసాయి పర్యవేక్షణలో ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ నిపుణులతో ఆకర్షణీయంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు.

దర్శనాల కోసం సముదాయం నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో మొబైల్​ కాంప్లెక్స్​ ఏర్పాటు కానుంది. అల్యూమినియం, ఇత్తడితో హైందవ సంప్రదాయం ఉట్టిపడేలా పనులు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈశాన్య దశ నుంచి తూర్పు రాజగోపురం వరకు వీటిని బిగించనున్నామని శిల్పి ఆనందసాయి తెలిపారు. బ్రహ్మోత్సవ రథ వేడుకల సమయంలో పక్కకు జరపడానికి వీలుగా వీటిని అమర్చనున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details