యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్, సీపీఐ కూటమిదేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట సీపీఐ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మెజారిటీలేని మున్సిపాలిటీల్లో ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లను పార్టీలు ఫిరాయింపజేసి అనైతికంగా ఛైర్మన్ పదవులు పొందడం ప్రజాస్వామ్యవాదిగా వచ్చిన కేసీఆర్కు తగదన్నారు.
నైతిక విజయం కాంగ్రెస్, సీపీఐ కూటమిదే: పల్లా వెంకటరెడ్డి - సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి
యాదాద్రి మున్సిపల్ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్, సీపీఐ కూటమిదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లను పార్టీ ఫిరాయింపులు చేసి ఛైర్మన్ పదవులను తెరాస పొందిందని విమర్శించారు.
నైతిక విజయం కాంగ్రెస్, సీపీఐ కూటమిదే: పల్లా వెంకటరెడ్డి
కాంగ్రెస్, సీపీఐ కూటమి యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో పన్నెండింటికి.. 8 స్థానాలు గెలిచినా.. జిల్లాకు సంబంధం లేని వాళ్లను ఎక్స్ అఫిషియో సభ్యులుగా తీసుకువచ్చి ఛైర్మన్ పీఠం కైవసం చేసుకున్నారన్నారని పల్లా ఆరోపించారు.
ఇవీ చూడండి:'రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళమెత్తండి'