తెలంగాణ

telangana

ETV Bharat / state

అంజన్న ఆలయాన్ని కూల్చొద్దని కౌన్సిలర్ల తీర్మానం - yadagirigutta

యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి వైకుంఠద్వారం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయాన్ని రోడ్డు విస్తరణ పనుల్లో కూల్చొద్దని 12 మంది కౌన్సిలర్లు తీర్మానం చేశారు. ఆ తీర్మాన పత్రాన్ని మున్సిపల్​ ఛైర్​పర్సన్​కు అందించారు.

Councilors resolved not to demolish the temple in road widening works in yadagirigutta
రోడ్డు విస్తరణ పనుల్లో ఆలయాన్ని కూల్చొద్దని కౌన్సిలర్ల తీర్మానం

By

Published : Jul 7, 2020, 9:46 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వైకుంఠ ద్వారం వద్ద గల ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని రోడ్డు విస్తరణ పనుల్లో కూల్చొద్దని యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 12 మంది కౌన్సిలర్లు తీర్మానం చేశారు. ఈ పత్రాన్ని ఆంజనేయ స్వామి ఆలయం ఎదుటే యాదాద్రి మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఎరుకల సుధా హేమందర్​గౌడ్​కు అందజేశారు. త్వరలోనే జిల్లా కలెక్టర్​కు కూడా అందిస్తామని తెలిపారు.

రోడ్డు విస్తరణలో ఆంజనేయ స్వామి వారి ఆలయం తొలగించకుండా ఉండేలా చూస్తామని యాదాద్రి మున్సిపల్​ ఛైర్​పర్సన్​ హామీ ఇచ్చారు.


ఇవీ చూడండి: 'తెలంగాణలో ఆంధ్రా పెత్తనం ఉండాలని ఉత్తమ్ కోరుకుంటున్నరు'

ABOUT THE AUTHOR

...view details