ఆర్టీసీ ఛార్జీలు పెంపు నిర్ణయంపై యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఛార్జీలు పెరిగితే సామాన్యులపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ అనితరామచంద్రన్కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయంపై కాంగ్రెస్ నిరసన
ఆర్టీసీ ఛార్జీలు పెంచాలన్న ఆలోచనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఛార్జీల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయంపై కాంగ్రెస్ నిరసన