మున్సిపల్ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అఖండ విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతగా 'కాంగ్రెస్ ప్రజా ఆశీర్వాద యాత్ర' నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వైకుంఠ ద్వారం మీదుగా గోశాల వరకు ర్యాలీ తీశారు.
'యాదగిరిగుట్ట నుంచే తెరాస పతనం మొదలైంది' - కాంగ్రెస్ కౌన్సిలర్ల విజయోత్సవ ర్యాలీ
యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఐ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. నైతిక తీర్పు ఇచ్చిన ప్రజలకు అన్ని వేళలా తోడుండి రుణం తీర్చుకుంటామని నేతలు తెలిపారు.
CONGRESS COUNCILLORS RALLY IN YADAGIRIGUTTA
సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు బలపరచిన 12మంది అభ్యర్థుల్లో ఏడుగురిని గెలిపించినందుకు ఓటర్లకు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తెరాస నాయకుల పతనం యాదగిరిగుట్ట నుంచే ప్రారంభమైందని ఆలేరు నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య ఆరోపించారు. నైతిక విజయం అందించిన యాదగిరిగుట్ట ప్రజల సమస్యలను పరిష్కరించి రుణం తీర్చుకుంటామన్నారు.
ఇవీ చూడండి:వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..
TAGGED:
CONGRESS RALLY