శ్రావణ శుక్రవారం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. వ్రతాల్లో ఎక్కువ మొత్తంలో భక్తుల పాల్గొనాలనే ఉద్దేశ్యంతో ఎలాంటి రుసుము లేకుండా ఉచిత సదుపాయాన్ని కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వరలక్ష్మి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి రుసుము లేకుండా, ఉచితంగా వ్రతాలు జరిపించుకునే అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు.
యాదాద్రిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు - Yadadri
శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
యాదాద్రిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు
Last Updated : Aug 17, 2019, 3:37 PM IST