యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, అథ్లెటిక్స్ శిక్షకులు నాగపూరి రమేశ్ కుమార్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తర్వాత ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత - యాదాద్రి లక్ష్మీనరసిరంహ స్వామిని దర్శించుకున్న నాగపూరి రమేశ్ కుమార్
రానున్న రోజుల్లో యాదాద్రి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేశ్ కుమార్ అన్నారు. ఈ క్షేత్రాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసిహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
'యాదాద్రి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం'
యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్నారని ఆయన కొనియాడారు. రానున్న రోజుల్లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందని పేర్కొన్నారు. స్వామి వారిని దర్శించుకోవడం మనసుకు ప్రశాంతత కలిగించిందని అన్నారు. వారితో పాటు ఫిజికల్ లిట్రసీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు మధు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి:కేంద్రాన్ని నిలదీయడానికి వెనకాడం: సీఎం కేసీఆర్
Last Updated : Oct 4, 2020, 11:36 AM IST