తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ ఆస్పత్రి దేవుడు లేని దేవాలయం లాగా మారింది' - Bhatti Vikramarka visiting Yadadri Bhubaneswar District Central Hospital

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఆరున్నర ఏళ్లుగా ప్రజా వైద్యాన్ని పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేశారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిని భట్టి విక్రమార్క సందర్శించారు. ఆస్పత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో 11 సివిల్ సర్జన్ పోస్టులకు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వివిధ విభాగాల్లో 61 పోస్టుల్లో ఉద్యోగులు లేరని పేర్కొన్నారు.

clp leader bhatti comment government hospital has become like a temple without God
'ప్రభుత్వ ఆస్పత్రి దేవుడు లేని దేవాలయం లాగా మారింది'

By

Published : Sep 3, 2020, 7:57 PM IST

'ప్రభుత్వ ఆస్పత్రి దేవుడు లేని దేవాలయం లాగా మారింది'

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఆస్పత్రిలో వసతులు, కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డీహెచ్ఎంవో సాంబశివరావుని జిల్లాలో కరోనా కేసులకు సంబంధించిన వివరాలపై ఫోన్​లో ఆరా తీశారు. ఆరున్నర ఏళ్లుగా సీఎం కేసీఆర్ వైద్యం, ప్రజల ఆరోగ్యంని పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రతీ కరోనా మరణం.. కేసీఆర్ చేసిన హత్యగా భావించాలని అన్నారు. కరోనాని ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

ఆరోగ్య శాఖలో ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి కూడా కేసీఆర్, ఆరోగ్య మంత్రి రివ్యూ చేయలేదన్నారు. ఆస్పత్రి దేవుడు లేని దేవాలయంలా మారిందని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సివిల్ సర్జన్ పోస్టులు 11గాను 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆస్పత్రిలో ఉద్యోగులు సరిపోను లేరని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జిల్లా ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా చేసి రెండేళ్లు అవుతున్నా.. సదుపాయాలు లేవని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు మూసి వేసి యశోద లాంటి ప్రైవేటు వాటికి మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పేదల కోసం మాట్లాడుతుంటే.. రాజకీయాలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన ముడు లక్షల కోట్ల అప్పులో 10 వేల కోట్లు ఆస్పత్రులపై ఖర్చు చేస్తే బాగుండేదని బట్టి అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని శూలాలు పెట్టి గుచ్చినా లేచే స్థితిలో లేదన్నారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతదన్న కేసీఆర్, మాస్కులు లేకుండా సేవ చేస్తామని.. ఆరోజు జోకర్​లా మాట్లాడారన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రేట్లను ప్రభుత్వం పర్యవేక్షించాలని అన్నారు. ప్రజల మీద ప్రేమ ఉంటే వైద్య శాఖలో రివ్యూ పెట్టి సమీక్షించాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :'బరితెగించి బజారున పడి దోచుకుంటున్నారు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details