యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో హమాలీ, నిర్మాణ, పారిశుద్ధ్య, ఆటో కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికులను ఆదుకోవాలంటూ ఆందోళన - citu protest at thurkapalli
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికులను ప్రభుత్వ ఖర్చులతో సొంత ప్రాంతాలకు తరలించాలన్నారు. కరోనా కాలంలో సేవలందిస్తున్న ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతోన్న ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 7500 ఆర్థిక సహాయం అందించాలని.. 3 నెలల పాటు ఉచిత సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులందరికీ వర్తించేలా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
ఇదీ చూడండి:'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'