ప్రజల్లో భయ భ్రాంతులు తొలగించి అందరూ ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో ఈ సోదాలు జరిగాయి. సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను, మూడు ఆటోలు, నాలుగు కార్లు, ఏడు సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ నారాయణ రెడ్డితో పాటు అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ భుజంగరావు, ఐదుగురు సీఐలు , పది మంది ఎస్సైలు, 100 మందికి పైగా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
బీబీనగర్‌లో నిర్బంధ తనిఖీలు - bb nagar
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. ఎన్నికల్లో ప్రజలంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటువేసేలా ముందస్తుగా సోదాలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
బీబీనగర్‌లో నిర్బంధ తనిఖీలు