యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం వల్ల 50 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దివిస్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్న బడుగు భిక్షపతిగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఉదయం 5 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. కారు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చౌటుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం...శరీరం నుజ్జునుజ్జు - LABOUR DEAD IN ACCIDENT
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పురపాలిక పరిధిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వైపు అతి వేగంతో దూసుకెళ్తోన్న కారు ఓ కార్మికుడిని బలంగా ఢీ కొట్టింది. ఫలితంగా అక్కడికక్కడే మృతి చెందాడు.
రోడ్డు దాటుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం