యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రాంరెడ్డి అనే కార్మికుడికి స్వల్పగాయాలయ్యాయి. పేలుడు శబ్ధానికి పక్కనే ఉన్న మరో ఇద్దరికి చెవి సమస్య ఏర్పడింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ అధికారి తెలిపారు. స్మోక్ మార్కార్ అనే ప్రొడక్టు తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించినట్లు వివరించారు. కార్మికుల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
యాదాద్రి జిల్లాలో పేలుడు... ముగ్గురికి గాయాలు - ముగ్గురికి గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ కంపెనీలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
యాదాద్రి జిల్లాలో పేలుడు... ముగ్గురికి గాయాలు