యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా... రోడ్డు విస్తరణ చేపట్టాలని భాజపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. యాదాద్రి కొండ చుట్టూ... నిర్మిస్తున్న రింగ్ రోడ్డు కింద ఇండ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించారు. కూల్చివేతకు గురవుతున్న ఇండ్లను బాధితులతో కలిసి మోత్కుపల్లి పరిశీలించారు.
'కొండను తొలిచి రోడ్డేస్తే... ఒక్క ఇల్లు కూల్చక్కర్లేదు' - road widening works in yadadri
యాదాద్రిలో చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేతకు గురవుతున్న ఇండ్లను భాజపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పరిశీలించారు. కొండను తొలిచి రోడ్డు నిర్మిస్తే... ఒక్క ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం రాదని అధికారులకు సూచించారు.
bjp leader motkupalli narasimhulu visited in yadadri
వైకుంఠ ద్వారం నుంచి గాంధీ విగ్రహం వరకు కూల్చివేతకు గురయ్యే ఇండ్లను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. యాదాద్రి కొండను కొంచెం తొలిచి రోడ్డు నిర్మిస్తే ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా రోడ్డు వేయొచ్చునని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ అనితారామచంద్రన్తో ఫోన్లో మాట్లాడి ఇల్లు కోల్పోకుండా రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ మార్చాలని మోత్కుపల్లి సూచించారు.