హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి భువనగిరికి వచ్చిన బండారు దత్తాత్రేయకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భువనగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. దేశం అభివృద్ధి చేందాలంటే అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అందాలన్నారు. ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని అభిలాషించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జిల్లా భాజపా అధ్యక్షుడు శ్యామ్ సుందర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సమ్మేళనం - భువనగిరి
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి భువనగిరికి వచ్చిన బండారు దత్తాత్రేయకు భాజపా శ్రేణులు, ఇతర పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బండారు దత్తాత్రేయ