యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు యముడు వచ్చాడు. మాస్క్ లేకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా యమలోకానికి తీసుకెళ్తానని హెచ్చరించారు. ఇలా యమవేషంలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు కళాకారులు.
మాస్క్ ధరించకుంటే యమలోకానికే - మాస్కులు
మాస్క్ ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా యమలోకానికి చేరుకుంటారని ప్రజలను హెచ్చరిస్తున్నారు యుముడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కళాకారులు వినూత్నంగా యమవేషంలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.
మాస్క్ ధరించకుంటే యమలోకానికే
చిత్ర గుప్తుడుని, భటులను వెంటపెట్టుకొని యమధర్మరాజు చౌటుప్పల్‌లోని కూరగాయల మార్కెట్, చిన్న కొండూరు, తంగడపల్లి రోడ్లలో పర్యటించి మాస్క్ ధరించకుండా వాహనాలపై వెళ్లే వారిపై చేతిలోని యమ పాశాన్ని విసురుతున్నాడు. పక్కనే ఉన్న చిత్ర గుప్తుడు తన చేతిలోని చిట్టాను తెరిచి కరోనా సమయంలో మాస్క్ ధరించకుండా, నిబంధనలు పాటించకుండా బయట తిరుగుతున్నందున శిక్ష వేయాలని చెబుతున్నాడు.
ఇవీచూడండి:11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య