ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పున:ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉద్యోగులు, సిబ్బంది, అర్చకులకు కరోనా సోకడం వల్ల ఏడు రోజుల పాటు తాత్కాలికంగా స్వామివారి ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఇవాళ ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారి నిత్య, శాశ్వత కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమాలు, అష్టోత్తర పూజలు అభిషేకాలు, అర్చనలు, సువర్ణ పుష్పార్చనలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.
ప్రత్యేక చర్యలు