యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 108 అంబులెన్సులు డీజిల్ లేక నిరుపయోగంగా మారుతున్నాయి. నారాయణపురం మండలంలో మిషన్ భగీరథ కార్మికుడు సందీప్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆసుపత్రికి తరలించేందుకు 108కి సంప్రదించగా... చౌటుప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉన్నందున వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడే ఉన్న అంబులెన్స్ డ్రైవర్‌ను అడగ్గా... డీజిల్ లేదని సమాధానమిచ్చాడు. చేసేదేమీ లేక ప్రైవేటు అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
డీజిల్ లేక మూలుగుతున్న అంబులెన్స్‌లు... - choutuppal
డీజిల్ లేక అంబులెన్స్‌లు మూలుగుతున్నాయి. రోగులను, క్షతగాత్రులను సరైన సమయంలో ఆసుపత్రికి చేర్చలేని పరిస్థితి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.
డీజిల్ లేక మూలుగుతున్న అంబులెన్స్‌లు...