తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రూ. 5 కోట్ల ఇరవై లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొంగిడి సునిత  శంకుస్థాపన చేశారు. ఆలేరును నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

By

Published : Aug 4, 2019, 1:39 PM IST

ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం


రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కొరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు గ్రామ పంచాయతీని నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సునీత అన్నారు. రూ. 5 కోట్ల 20లక్షల వ్యయంతో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 20 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యావాదాలు తెలిపారు. ఆలేరులో రూ. 2 కోట్లతో బీటి రోడ్డు పనులు, మెయిన్ రోడ్డుపై రూ. 1.2 కోట్లతో బటర్ ఫ్లైయ్ లైట్లు, స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్డులకు రూ. 2 కోట్లు కేటాయించామని చెప్పారు. రూ. 3.5 కోట్లు అండర్ డ్రైనేజీ పనులకు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఆలేరును అన్ని హంగులతో తీర్చి దిద్దుతామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య అన్నారు.

ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details