యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్‌కి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు. నియోజకవర్గంలోని గంధమల్ల రిజర్వాయర్ పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్య ధోరణి తగదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గంధమల్ల రిజర్వాయర్‌తో ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానన్న సీఎం మాట తప్పారని మండిపడ్డారు.
‘గంధమల్లపై నిర్లక్ష్యమెందుకు?’ - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
గంధమల్ల రిజర్వాయర్ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆలేరు కాంగ్రెస్ నాయకులు ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన దీక్ష నిర్వహించారు. గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలన్నారు.
‘గంధమల్లపై నిర్లక్ష్యమెందుకు?’
గంధమల్లకు కూతవేటు దూరంలో ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్ ఆగమేఘాల మీద పూర్తి చేస్తూ.. గంధమల్లను నిర్లక్ష్యం చేయడం సీఎం స్థాయికి తగదని.. ఆలేరు నియోజక వర్గ కాంగ్రెస్ నేత బీర్ల అయిలయ్య విమర్శించారు. గంధమల్ల రిజర్వాయర్ పనుల ప్రారంభం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్ కోసం మళ్లీ ప్లాస్మా దానం