తెలంగాణ

telangana

ETV Bharat / state

బండిసంజయ్​ రచ్చబండలో ఉద్రిక్తత.. తెరాస, భాజపా కార్యకర్తల వాగ్వాదం - మనిపంపుల

bandi sanjay rachabanda: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రచ్చబండ కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మనిపంపులలో ఈ సంఘటన జరిగింది.

bandi sanjay rachabanda
bandi sanjay rachabanda

By

Published : Aug 11, 2022, 10:03 PM IST

Updated : Aug 11, 2022, 10:14 PM IST

bandi sanjay rachabanda: బండి సంజయ్‌ రచ్చబండ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాసంగ్రామ యాత్రంలో భాగంగా రచ్చబండలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో భాజపా, తెరాస కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మనిపంపులలో ఈ సంఘటన జరిగింది.

బండిసంజయ్​ రచ్చబండలో ఉద్రిక్తత.. తెరాస, భాజపా కార్యకర్తల వాగ్వాదం

బండిసంజయ్ రచ్చబండలో ఎస్సీల సమస్యలపై ప్రస్తావించారు. అదే సమయంలో అక్కడున్న తెరాస కార్యకర్తలు కేంద్రప్రభుత్వం ఎస్సీలకు ఏమిచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులేమిటో చెప్పాలని బండి సంజయ్‌ను నిలదీశారు. దీంతో కాసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడ్నుంచి పంపించివేశారు.

Last Updated : Aug 11, 2022, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details