తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన రైతు

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో ఓ రైతు వాగ్వాదానికి దిగాడు. చెక్​డ్యామ్​ నిర్మిస్తే తన ఐదెకరాల భూమి నీటిలో మునుగుతుందని ఎమ్మెల్యేకు చెప్పాడు. అక్కడ చెక్​డ్యామ్​ నిర్మిస్తున్నారని సమాచారం లేదని అన్నాడు. ఆలేరు మండలం గొలనుకొండ వాగుపై నిర్మించనున్న చెక్​డ్యామ్ నిర్మాణ పనులకు గురువారం గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు.

A farmer argument with mla gongidi sunitha
ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన రైతు

By

Published : Aug 28, 2020, 5:44 AM IST

ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన రైతు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో నూతన చెక్ డ్యామ్ నిర్మాణానికి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు. అక్కడకు వచ్చిన అమ్మనబోలుకు చెందిన రైతు బాలరాజు, ఎమ్మెల్యే గొంగిడి సునీతతో వాగ్వాదం చేశాడు.

చెక్​డ్యామ్ నిర్మాణం వల్ల తన ఐదెకరాల భూమి నీట మునుగుతుందని ఎమ్మెల్యేతో చెప్పాడు. కనీసం తమకు సమాచారం లేకుండానే చెక్​డ్యామ్ కడుతున్నారని వాపోయాడు. గొలనుకొండ, అమ్మనబోలు, అనంతారం, గ్రామాల రైతుల కోరిక మేరకు చెక్​డ్యామ్ వాగులో నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. చెక్​డ్యామ్ నిర్మాణ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటానని రైతు ఆవేదన చెందుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇదీ చూడండి :ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు నగల చోరీ

ABOUT THE AUTHOR

...view details