మల్కాజిగిరికి చెందిన పండ్ల తోటల గుత్తేదారు శక్తిమన్ వివిధ ప్రాంతాలలో తిరిగి మామిడి తోటలను ఒప్పందం చేసుకుంటుంటాడు. వేసవి సమీపించి ఎండల తీవ్రత క్రమేణా పెరుగుతుండటంతో తన ద్విచక్ర వాహనానికి రూ.1600 చెల్లించి ప్రత్యేక గొడుగును ఏర్పాటు చేయించుకున్నాడు. దీనివల్ల ఎండ తీవ్రత తగ్గించుకొని పనులు చేసుకోవచ్చని ఆయన చెప్పాడు. పలువురు దీని పట్ల ఆసక్తి చూపుతున్నారు.
ఆలోచన అదుర్స్: వానకే కాదు ఎండకూ గొడుగు - hyderabad news
వేసవి మొదలైంది. ఎండలు పెరిగిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే.. కారులో ఐతే ఓకే కానీ... బైక్పై వెళ్లాలంటే కాస్త భయపడాల్సిందే... కానీ అలాంటి భయం లేకుండా ఎండలో ప్రయాణం చేసేందుకు వినూత్న ఆలోచన చేశాడు మల్కాజిగిరికి చెందిన పండ్ల తోటల గుత్తేదారు శక్తిమన్.
వినూత్న ఆలోచనతో ప్రత్యేక గొడుగును ఏర్పాటు