యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మూడో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా మూడో విడతలో భాగంగా 6 మండలాల్లో 57 ఎంపీటీసీ స్థానాలకు 169 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 6 మండలాల్లో 6 జడ్పీటీసీలకు గానూ 31 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం లక్షా 57 వేల 739 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్న మహిళలు - ZPTC
యాదాద్రి భువనగిరి జల్లాలో తుది దశ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా లక్షా 57 వేల 739 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్న మహిళలు
Last Updated : May 14, 2019, 12:22 PM IST