వైభవోపేతంగా నారసింహుని ఉత్సవాలు - narasimha
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు లక్ష మంత్రోచ్ఛరణలతో కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేదపండితులు రెండో రోజు అమ్మవారికి లక్ష మంత్రోచ్ఛరణలతో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామి వారు కాళీయమర్దనం అలంకారణలో బాలాలయంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో వైటీడీఎ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నర్సింహ మూర్తి పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు రేపు సాయంత్రం పూజా కార్యక్రమాలతో ముగియనున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు.