యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలో మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాదేశాలు బేఖాతరు చేసినందుకు ఐపీసీ 188, మాస్క్ ధరించని కారణంగా ఐపీసీ 269 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
13 మందిపై కేసు...
మాస్కులు పెట్టుకోకుంటే రెండు సెక్షన్ల మీద కేసులు నమోదు చేస్తున్నామని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇవాళ 13 కేసులు నమోదు చేశామని... వీరంతా కోర్టులో 500 నుంచి 1000 రూపాయల వరకు అపరాధ రుసుం కట్టుకోవాల్సి ఉంటుందని సీఐ వెల్లడించారు. ప్రజలంతా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. అకారణంగా రోడ్డెక్కితే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : కామారెడ్డి జిల్లాలో మరో 2 కరోనా కేసులు