తెలంగాణ

telangana

ETV Bharat / state

కాకతీయ జూలాజికల్ పార్కులో అగ్నిప్రమాదం - fire

కాకతీయ జూలాజికల్​పార్కులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎండిన తుంగలోనుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి వ్యాపించాయి. ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు.

కాకతీయ జూ ​పార్కులో అగ్ని ప్రమాదం

By

Published : May 28, 2019, 10:08 AM IST

Updated : May 28, 2019, 10:27 AM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని కాకతీయ జూలాజికల్‌ పార్కులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెరువు శిఖం వద్ద ఉన్న ఎండిన తుంగలో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. పార్కులోని తుమ్మ చెట్లు తగలబడ్డాయి. ఫైరింజిన్‌, నీటి ట్యాంకర్ల ద్వారా అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వన్య ప్రాణులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని జూపార్కు అధికారి పున్నం చందర్ తెలిపారు. చెరవులో పేరుకుపోయిన ఎండు గడ్డిలో మంటలు చేలరేగి ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు.

కాకతీయ జూ ​పార్కులో అగ్ని ప్రమాదం
Last Updated : May 28, 2019, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details