తెలంగాణ

telangana

ETV Bharat / state

YS Sharmila: కేసీఆర్ స్పందించాలంటే.. ఇంకెంతమంది నిరుద్యోగులు చనిపోవాలి: షర్మిల - నిరుద్యోగ నిరాహార దీక్ష

ఎంతమంది నిరుద్యోగులు చనిపోతే కేసీఆర్ స్పందిస్తారు అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నా.. వాటిని భర్తీ చేయకపోవడాన్ని ఆమె తప్పబట్టారు.

ys-sharmila-unemployment-hunger-strike-in-hanamkonda
ys-sharmila-unemployment-hunger-strike-in-hanamkonda

By

Published : Sep 14, 2021, 12:33 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేస్తున్నారు. అందులో భాగంగా నేడు హన్మకొండ జిల్లాలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహర దీక్ష కొనసాగించేలా... ఎంపిక చేసిన జిల్లాల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు షర్మిల.

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలున్నా... ప్రభుత్వం వాటిని భర్తీ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి తప్పని వ్యాఖ్యానించారు. నిరుద్యోగి సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని షర్మిల ఆరోపించారు. ఎంతమంది నిరుద్యోగులు చనిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తారని ప్రశ్నించారు. నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వంలో స్పందన రావడంలేదని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:YS SHARMILA: "ద‌ళిత భేరి" సభకు మందకృష్ణ మాదిగను ఆహ్వానించిన షర్మిల

ABOUT THE AUTHOR

...view details