తనను ప్రేమించాలంటూ బాలికను ఓ యువకుడు వేధిస్తున్న ఘటన వరంగల్ పట్టణంలో జరిగింది. వరంగల్లోని గిర్మాజిపేటకు చెందిన విష్ణు అనే యువకుడు బాలికను గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడని బాలిక తల్లి వెల్లడించారు. ప్రేమను నిరాకరిస్తే తనను, తన కూతురిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. కేసు నమోదు - బాలికకు వేధింపులు
తనను ప్రేమించాలని లేదంటే చంపేస్తానని బాలికను బెదిరించిన ఓ యువకుడిపై ఆెమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్ పట్టణంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. కేసు నమోదు
మూడేళ్లుగా విసిగిపోయిన బాలిక.. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడం వల్ల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు చేసిన యువకుడి అరెస్ట్