తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాకు వెంటనే నియామాక పత్రాలు ఇవ్వాలి' - hanamkonda

నియామక ఉత్తర్వులు అందించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని వరంగల్​ అర్బన్ జిల్లాలో జూనియర్ లైన్​మెన్ అభ్యర్థులు నిరసనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తక్షణమే నియామకాలు చేపట్టాలి : జేఎల్ఎం అభ్యర్థులు

By

Published : Apr 16, 2019, 10:13 PM IST

నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ జూనియర్ లైన్​మెన్​ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు వరంగల్​ అర్బన్ జిల్లాలో నిరసన తెలిపారు. పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలంటూ హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ ఎదుట ఆందోళన చేపట్టారు. టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్​మెన్ పోస్టుల భర్తీకి రాత పరీక్షతో పాటు పోల్ టెస్ట్ కూడా నిర్వహించారు. నియామక ఉత్తర్వులు అందించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపించారు.

ధ్రువీకరణ పత్రాలు తీసుకొని నాలుగు నెలలు గడుస్తున్నా ఉత్తర్వులు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్​ను సాకుగా చూపుతూ జాప్యం చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే నియామకాల పక్రియ చేపట్టాలని అభ్యర్థులు కోరారు.

ఎన్నికల కోడ్​ను సాకుగా చూపుతున్నారు : జేఎల్ఎం అభ్యర్థులు

ఇవీ చూడండి : రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర

ABOUT THE AUTHOR

...view details