మద్యం తాగి వాహనం నడపడం నేరం. తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే జరిమానాయే కాదు... జైలు శిక్ష కూడా ఉంటుంది అనే అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించేలా... ఆసక్తికరమైన రీతిలో వీడియో రూపొందించారు.
చిన్నారులకు వాహనం ఇస్తే..
హెల్మట్ లేకుండా ప్రయాణం చేస్తే... ఏ విధంగా ప్రమాదాలపాలవుతారు... ప్రమాదాల సమయంలో హెల్మెట్ వినియోగం వాడకం ఎంత సురక్షితమో తెలియచేస్తూ... రూపొందించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. చిన్నపిల్లలు వాహనాలను నడుపుతూ ప్రమాదాలబారినపడడంపై.. రూపొందించిన వీడియో అందరిలోనూ అవగాహన తెస్తోంది.
రక్షణ కల్పిస్తారు.. అవగాహన కోసం వీడియోలు రూపొందిస్తారు.. కార్యాలయాల్లో పై అధికారులనుంచి.. బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిలనుంచి మహిళలు వేధింపులను ఎదుర్కొంటుంటే... ఏం చేయాలి, ఎవరిని ఆశ్రయించాలన్న అంశంపై రూపొందించిన వీడియోకు మంచి స్పందన వస్తోందని పోలీసులు తెలిపారు.
వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో... కమిషనరేట్లో పనిచేసే పోలీస్ విభాగం... ప్రత్యేకంగా ఈ వీడియోలకు రూపకల్పన చేస్తోంది. వారం పదిరోజులకొక వీడియో చేస్తూ... నగరప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.
ఇదీ చూడండి:జాతీయ మ్యూజియంగా పార్లమెంట్ భవనాలు!