తెలంగాణ

telangana

ETV Bharat / state

రసాభాసగా మారిన స‌రుకుల పంపిణీ - నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రజలకు వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్​ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు. ఆ పంపిణీ కాస్తా రసాభాసగా మారింది.

Warangal East MLA Nanpaneni Narendar Distributes Essential goods for Poor peoples
రసాభాసగా మారిన స‌రుకుల పంపిణీ

By

Published : May 30, 2020, 6:20 PM IST

వరంగల్ నగరంలో సరుకుల పంపిణీ రసాభాసగా మారింది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో 14,18వ డివిజన్​లో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రాంగణం నుంచి వెళ్లిన వెంటనే జనాలు ఫంక్షన్ హాల్ వద్దకు గుంపులు గుంపులుగా రావటం వల్ల నిర్వాహకులు ఒక్కసారిగా సరుకుల పంపిణీ నిలిపివేశారు.

అనంతరం ఒక్కొక్కరిని లోనికి అనుమతించటం వల్ల సరుకుల పంపిణీ ప్రశాంతంగా జరిగింది. 25 వేల మందికి నిత్యావసర సరుకులను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నేతలు తెలిపారు. దాతల సహకారంతోనే సరుకుల పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.

ABOUT THE AUTHOR

...view details