వరంగల్ పార్లమెంటు భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తి ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందని ఆరోపించారు. ఎన్నికలప్పుడు ప్రజలను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేశారని విమర్శించారు. తాను గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజక వర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.
'గెలిచినా ఓడినా నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయం'
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తూ, నియంతలా వ్యవహరిస్తున్నారని వరంగల్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తి ఆరోపించారు. తెరాసకు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్పై వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి విమర్శలు