.
ఓటంటే తెల్ల కాగితం కాదురా.. ఓటంటే వంద నోటు కాదురా.. - ఓటు హక్కుపై అవగాహన
అసెంబ్లీ... పార్లమెంటు... మున్సిపల్ ఇలా ఎన్నికలేవైనా కావచ్చు... ఓటేయడం మాత్రం మనందరి బాధ్యత.. కర్తవ్యం. మొన్నే.. వేశాం కదా మళ్లీ వేయాలా... అని అనుకోకూడదు. పనులున్నాయ్ కదా... అంటూ ఓటుకు దూరం జరగడమూ సరికాదు. ఎన్ని ముఖ్యమైన పనులున్నా సరే.. వాటన్నింటినీ పక్కన పెట్టి పోలింగ్ రోజున ఓటేసి తీరాల్సిందే. అని వరంగల్ కళాకారులు పాటల రూపంలో ఓటు హక్కుపైన అవగాహన కల్పిస్తున్నారు. ఓటంటే తెల్ల కాగితం కాదురా.. ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా.. అనే గేయాలు ఆకట్టుకుంటున్నాయి.
ఓటంటే తెల్లం కాగితం కాదురా.. ఓటంటే వంద నోటు కాదురా..