ప్రభుత్వ చీఫ్ విప్ పదవి రావడం వల్ల... వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డితో పాటు... నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు వినయ్ భాస్కర్‌కు మిఠాయిలు తినిపించి, అభినందనలు తెలియజేశారు. పలువురు ముఖ్యనేతలు వినయ్ భాస్కర్‌కు చరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ పదవి లభించడంపై వినయ్ భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన బాధ్యతను మరింత పెంచిందని.. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. పార్టీకి విధేయుడిగా ఉంటూనే.. శాసనసభ వ్యవహారాలన్నీ సజావుగా జరిగేలా చూస్తానన్నారు. చీఫ్ విప్ పదవికే వన్నె తెస్తానంటున్న వినయ్ భాస్కర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
చీఫ్ విప్ పదవికే వన్నె తెస్తా: దాస్యం - TRS
శాసనసభ చీఫ్ విప్ పదవి.. తన బాధ్యతను మరింత పెంచిందన్నారు దాస్యం వినయ్ భాస్కర్. తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
VINAY BHASKAR