వరంగల్ పట్టణంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా వేకువ జామునుంచే భక్తులు పోటెత్తారు. రుద్రేశ్వరున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ జిల్లా ఎన్నికల పరిశీలకులు వాణి దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఉగాది విశిష్టతను, పంచాంగ శ్రవణ ఆవశ్యకతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు.
వేయి స్తంభాల ఆలయంలో ఉగాది సందడి - hanmakonda
తెలుగు లోగిళ్లు ఉగాది శోభను సంతరించుకున్నాయి. వాకిళ్లు ముగ్గులతో, గుమ్మాలు మావిడాకులతో, చెట్లు లేత చిగుళ్లతో శోభాయమానంగా తయారయ్యాయి. పండుగ పర్వదినాన ప్రజలు దైవదర్శనం చేసుకొని కొత్త ఏడాదికి వెళ్లి ఆధ్యాత్మిక చింతనతో స్వాగతం పలుకుతున్నారు. వరంగల్లోని వేయిస్తంభాల ఆలయం భక్త సందోహంగా మారింది.
వేయి స్తంభాల ఆలయంలో ఉగాది సందడి