తెలుగు సంవత్సరం, ఉగాది పండుగను పురస్కరించుకుని వరంగల్ వెయ్యి స్తంభాల గుడికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సిద్దేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఓరుగల్లు వెయ్యి స్తంభాల గుడిలో ఉగాది వేడుకలు - వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయంలో భక్తుల రద్దీ
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడి ఉగాది శోభ సంతరించుకుంది. ఉదయం నుంచే భక్తులు పెద్దఎత్తున రుద్రేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వెయ్యి స్తంభాల గుడిలో భక్తుల రద్దీ
ఆలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు సురేశ్ 21 కిలోల భక్షాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో ఉగాది విశిష్టతను, పంచాంగ శ్రవణ ఆవశ్యకతను భక్తులకు ఆయన వివరించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.