నేటితో ప్రచారానికి తెరపడుతున్నందున అన్ని పార్టీల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లను కలిసేందుకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో తెరాస లోక్‌సభ అభ్యర్థి పసునూరి దయాకర్ తరఫున ఎమ్మెల్యే వినయ భాస్కర్ ఎన్నికల ప్రచారం చేశారు. నగరంలోని పలు కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. కరపత్రాలను పంచుతూ పసునూరి దయాకర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రవేశ పెట్టిన పథకాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటేయాలని కోరారు.
హన్మకొండలో తెరాస ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం - hanmakonda
ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయినందున అన్ని పార్టీల నాయకులు వేగం పెంచారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో తెరాస లోక్‌సభ అభ్యర్థి దయాకర్ తరఫున వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ ఎన్నికల ప్రచారం చేశారు.
హన్మకొండలో తెరాస ప్రచారం