సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయని తెరాస అభ్యర్థి గుగులోత్ దివ్య రాజునాయక్ అన్నారు. అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హన్మకొండలో ఈ ఉదయం నుంచే ప్రచారాలు మొదలుపెట్టారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: దివ్య రాజునాయక్ - తెలంగాణ వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. నిన్నటివరకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో ప్రచారం జోరందుకుంది. 65వ డివిజన్ తెరాస అభ్యర్థి గుగులోత్ దివ్య రాజునాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చూసి ఓటేయాలని అభ్యర్థించారు.
వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ప్రచారం, తెరాస అభ్యర్థి ప్రచారం
65వ డివిజన్ తెరాస అభ్యర్థి గుగులోత్ దివ్య రాజునాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. గురువారం వరకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తైంది. ఇవాళ్టి నుంచి ప్రచారాలు జోరందుకున్నాయి. తెరాస అభివృద్ధే తమని గెలిపిస్తుందని దివ్య రాజునాయక్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఫారెస్ట్ అధికారులకు కరోనా రోగుల జలక్