ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తూ... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం జనగామ, వరంగల్ జిల్లాల్లో కార్మికులు చేస్తున్న సమ్మెలో పాల్గొన్నారు. ఖమ్మంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించి ఈ రోజు మరణించిన ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డిది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య అని ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఆర్టీసీ సంపదను అనుభవించాలనే ఆశతోనే సీఎం కేసీఆర్ ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలే తప్పా... మన ప్రాణాలు తీసుకోవద్దంటూ కార్మికులకు సూచించారు. 19వ తేదీన కార్మికులు ప్రకటించిన బంద్కు అందరూ సహకరించాలని కోదండరాం కోరారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం ప్రభుత్వం చేతగాని తనాననికి నిదర్శనమని, సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత అని, బాధ్యతలను విస్మరించి పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అంతకు ముందు పార్కులో ఉన్న తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.
'రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలి' - KODANDA RAM FIRES ON KCR
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న 9వ రోజు సమ్మెలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. జనగామ, వరంగల్ జిల్లాలకు వెళ్లి తన మద్దతు తెలిపారు.
'రాష్ట్రానికి పట్టిన పీడను వదలించాలలి'