వరంగల్ పట్టణవాసుల ఆరాధ్య దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో కల్యాణం, బ్రహ్మోత్సవాలు కన్నుల పండవగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి... పంచామృతాలతో పాటు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. కాళీమాత దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇవాళ సాయంత్రం రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు శేషు తెలిపారు.
వైభవంగా భద్రకాళీ అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
భద్రకాళీ బ్రహ్మోత్సవాలు