గరిష్ఠ స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. క్షణం పాటు ఎండలో ఉంటే ఒంట్లో నీరు ఆవిరైపోతుందేమో అన్నంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మన పరిస్థితే ఇలా ఉంటే మరి జూలో ఉండే మూగ జీవాల పరిస్థితి మరీ వర్ణణాతీతం.
చుట్టూ ఉండే ఇనుప పంజరాలు ఎండ తీవ్రతకు నిప్పుకణంలా కాలిపోతుంటే.. కుంటల్లో నీరు మరిగిపోతున్నట్లు పొగలు కక్కుతుంటే క్షణం నిలవలేక మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించేందుకు హన్మకొండలోని కాకతీయ జంతు ప్రదర్శన శాల అధికారులు మూగ జీవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.