వరంగల్ నిట్‌లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రతిభ కనపరిచిన 60 మంది బాలబాలికలను ఎంపిక చేసి నెల రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులను కాజీపేట్ రైల్వే లోకో షెడ్‌కి తీసుకెళ్లారు. రైల్వే అధికారులు రైలింజన్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలు, రిపేర్లు వంటి విషయాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. చిన్నారులు తమకు తెలియని కొత్త విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
కాజీపేట రైల్వే లోకోషెడ్‌ను సందర్శించిన విద్యార్థులు
విద్యార్థులకు ప్రయోగాలపై ఆసక్తి కలిగించేందుకు వరంగల్ నిట్ నడుం బిగించింది. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైల్వే లోకో షెడ్‌కి విద్యార్థులను తీసుకెళ్లారు.
కాజీపేట రైల్వే లోకోషెడ్‌ను సందర్శించిన విద్యార్థులు
ఈ నెల 30 వరకు జరిగే ఈ తరగతుల్లో వివిధ విభాగాల్లోని ప్రయోగశాలలో పరిశోధనలు ఎలా జరుగుతున్నాయో ప్రత్యక్షంగా వీక్షించి వాటి గురించి తెలుసుకునే అవకాశం కల్పించారు.
ఇదీ చూడండి : ఉద్యోగానికి ఎసరు తెచ్చిన ఐపీఎల్ పాస్