మహిళలపై దాడులను అరికట్టాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. హత్యాచారానికి పాల్పడిన నిందితుల కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్థూపం వరకు తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
మహిళలపై దాడులను నిరసిస్తూ విద్యార్థినుల ర్యాలీ - tjs_students_rally
వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ కేంద్రంగా మహిళలపై దాడులను నిరసిస్తూ టీజేఎస్ ఆధ్వర్యంలో విద్యార్థినిలు ధర్నా నిర్వహించారు. దాష్టీకాల నివారణకు పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలను తీసుకోవాలని కోరారు.
హత్యాచార నిందితులకు వెంటనే శిక్షలు విధించాలి : విద్యార్థినిలు
రోజు రోజుకు మహిళలపై హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను పటిష్ఠ పరిచి మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన మానస, సమత కేసుల్లో దోషులను వెంటనే శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం