విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తరగతి గదులను బహిష్కరించి ర్యాలీ చేపట్టారు. కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ భద్రకాళి ఆలయం మీదుగా ఎంజీఎం కూడలి వరకు సాగింది. అనంతరం ఎంజీఎం కూడలిలో మానవహారం నిర్వహించారు. పెరిగిన ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ర్యాలీ - పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ర్యాలీ
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ... వరంగల్ పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ర్యాలీ