తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీనివాస్​ రెడ్డిది ప్రభుత్వ హత్యే: పొన్నాల - వరంగల్​

ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​ రెడ్డిది ప్రభుత్వ హత్యేనని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

శ్రీనివాస్​ రెడ్డిది ప్రభుత్వ హత్యే: పొన్నాల

By

Published : Oct 13, 2019, 11:39 PM IST

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్​ రెడ్డి మృతికి కేసీఆరే బాధ్యత వహించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్​లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదుగురు కార్మికులు గుండెపోటుతో మరణించారన్నారు. పండగ పూట 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు పస్తులుంటే... కేసీఆర్ వాహనాలకు పూజలు చేస్తూ కుటుంబంతో సంతోషంగా గడిపారని విమర్శించారు. సంస్థ నష్టాల్లో ఉన్నంత మాత్రాన ప్రైవేట్​ పరం చేస్తామనడం దారుణమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేసీఆర్​ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్​ చేశారు.

శ్రీనివాస్​ రెడ్డిది ప్రభుత్వ హత్యే: పొన్నాల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details