హన్మకొండ బస్టాండ్ రోడ్డు .... ఈ పేరు వింటేనే నగర వాసులకు వణుకుపుడుతోంది. హన్మకొండలోని బస్టాండ్ రోడ్డుపై వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాలి.. ఇది ముమ్మాటికి సత్యం. హన్మకొండ బస్టాండ్ నుంచి రోజు వేలాది వాహనాలు నడుస్తాయి. ఇటీవలి వానలకు భారీగా గుంతలమయమై భయంకరంగా మారింది. ఈ రోడ్డుపై వాహనాలు వెళ్తుంటే ఎప్పుడు బురద నీళ్లు మీద పడుతాయోనని పక్కన ఉన్న వారు భయాందోళనకు గురవుతున్నారు.
గుంతలమయంగా హన్మకొండ బస్టాండ్ రోడ్డు...
హన్మకొండ బస్టాండ్ రోడ్డుపై ప్రయాణించాలంటే నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. నగరంలో రహదారులపై నగరవాసులు ఇబ్బందులు పడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా వారు కళ్లు తెరవాలని ప్రజలు వేడుకుంటున్నారు.
గుంతలమయంగా హన్మకొండ బస్టాండ్ రోడ్డు... పట్టించుకునే నాథుడే లేడు!
ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వేరే మార్గంలో వెళ్లేందుకు గత్యంతరం లేక ప్రాణాలకు తెగించి ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. రహదారులపై భారీ గుంతలతో నగరవాసులు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజా ప్రతినిధులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా అధ్వాన్నంగా ఉన్న ఈ రోడ్డు... ఇటీవలి వర్షాలకు మరికాస్త ప్రమాదకరంగా మారింది.