ఎడతెరిపిలేని వాన....ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను వారం రోజుల పాటు....కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు...పొంగి పొర్లుతూ మత్తడి పోశాయి. పది, పదిహేను అడుగుల మేర ప్రవహించడంతో....ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రోడ్లు దెబ్బతినగా....చాలా చోట్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఆర్అండ్బీ రోడ్లు 109.3 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీ రోడ్లు.... 53 కిలోమీటర్ల మేర దెబ్బతినగా.....48 పంచాయతీల్లో రోడ్లు 198.58 కిలోమీటర్ల మేర గోతులు పడినట్లు అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్లు దెబ్బతినడం వల్ల....123,34,00,000 రూపాయల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.
ముప్పు తెచ్చిన నాలాలు
ప్రవాహానికి మించి నాలాలు ఉప్పొంగి.... మున్సిపల్ నాలాలు 11, సాధారణ నాలాలు 111 దెబ్బతిన్నాయి. మెుత్తం 59,43,00,000 రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 41 చెరువులకు నష్టం వాటిల్లగా...వీటి మరమ్మతులకు...6,23,00,000 రూపాయలు అవుతుందని ప్రాథమికంగా లెక్కలు వేశారు. కుండపోత వర్షాలకు 96 కాలనీలు నీట మునగగా.....25 లక్షల మేర నష్టం వాటిల్లింది. వరదల ముప్పును గ్రహించిన సర్కార్...అన్ని జిల్లా కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. ముంపు బాధితులకోసం...మొత్తం 108 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా....24,098 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తక్షణ అవసరాలకోసం... ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను కేటాయించింది.