లోక్సభ ఎన్నికల అనంతరం ప్రతి జిల్లాలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి రైతుల భూ సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ వరంగల్ ప్రచార సభా వేదికగా హామీ ఇచ్చారు. ఎవరికి లంచం ఇవ్వవద్దని స్పష్టం చేశారు.
రెండు మాసాల్లో కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం: కేసీఆర్ - TRS_WGL
కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రాబోయే రెండు మాసాల్లో సమగ్ర మార్పులు తెస్తామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ హక్కులు, ప్రాజెక్టుల కోసం తప్పకుండా తెరాస ఎంపీలు గెలవాల్సిందేనన్నారు.
రెండు మాసాల్లో కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం: కేసీఆర్
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన రోజు నుంచి దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి... వాటిని ఎందుకు ఉపయోగిస్తలేరని అడిగితే భాజపా, కాంగ్రెస్ స్పందించటం లేదన్నారు. తెలంగాణ హక్కులు, ప్రాజెక్టులకోసం తప్పకుండా తెరాస ఎంపీలు గెలవాల్సిందేనన్నారు. కాంగ్రెస్, భాజపా ఎవరు గెలిచినా దిల్లీకి గులాములేనన్నారు. మోదీ, రాహుల్ ముందు సిట్ అంటే సిట్ ,స్టాండ్ అంటే స్టాండ్ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి:ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు: కేసీఆర్
Last Updated : Apr 3, 2019, 7:49 AM IST