వరంగల్ అర్బన్ జిల్లా జఫర్గఢ్ మండలం సూరారం గ్రామంలో పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రైస్ మిల్లులో సుమారు 340 బస్తాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 170 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే మండలానికి చెందిన ముగ్గురి సాయంతో గ్రామాల నుంచి బియ్యాన్ని సేకరించి.. ఇక్కడ నిల్వ ఉంచినట్లు రైస్ మిల్లు యజమానులు తెలిపారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 170 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
వరంగల్ అర్బన్ జిల్లా జఫర్గఢ్ మండలం సూరారం గ్రామంలో రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 340 బస్తాల్లో నిల్వ ఉంచిన 170 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత
సుమారు రూ.4,25,000 విలువ చేసే బియ్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మిల్లు యజమానులు, సరఫరాదారులు, హమాలీలతో సహా మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
- ఇదీ చూడండి:నోరు మెదపలే: ఆ నలభై లక్షలు ఎక్కడ దాచినట్టు?