వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం - 2020 నియంత్రిత పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే రమేశ్ పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.
'రైతుకు లాభం కోసమే.. నియంత్రిత సాగు'
రైతులు నియంత్రిత సాగులో రాణించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పంటలను వేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ కర్షకులను కోరారు. ఐనవోలు మండలం సింగారం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం - 2020 నియంత్రిత పంటల సాగు విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
రైతుకు లాభం కోసమే.. నియంత్రిత సాగు
రైతులు వేసిన పంటలే వేసి నష్టాల పాలవుతున్నారని, అందుకే కొత్తరకం పంటలు సాగు చేయాలని కోరారు. భూ సారానికి అనుకూలమైన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తారని.. దానికి అనుకూలంగా సాగు చేస్తే పంట దిగుబడి వచ్చి అధిక లాభాలు వస్తాయని ఎమ్మెల్యే రమేశ్ పేర్కొన్నారు. రైతు పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వచ్చే పంటను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:ఆధునిక సేద్యం.. అధిక లాభం: మంత్రి ఇంద్రకరణ్